రోజు రసం అన్నం తినే అలవాటు సౌత్ ఇండియన్స్ కి ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది చింతపండు రసం మంచిదని మరి కొంతమంది టమాటా రసం మంచిదని అంటూ ఉంటారు. నిజానికి రెండు మంచివే. ఒక్కొక్క రసం కి వాటివాటి..లాభాలు ఉన్నాయి.
టమాటా రసం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది విటమిన్ Cతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ రసం మీ చర్మానికి ఎంతో సహాయపడుతుంది. ఈ రసం తాగడం ద్వారా మీ శరీరంలోని టాక్సిన్లను తగ్గించి.. మీరు ఎంతో అందంగా కనిపించేలా చేస్తుంది.
మరోపక్క చింతపండు రసం మీ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఎన్నో దయచేసి పెడుతుంది. అలాగే, ఇందులో.. విటమిన్ C పుష్కలంగా ఉండి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, టమాటా రసం ఎక్కువ మంచిది. ఈ రసం ఎక్కువగా ఇమ్యూనిటీ అందిస్తే.. చింతపండు రసం జీర్ణ సంబంధిత సమస్యల్ని పరిష్కరిస్తుంది.
కాబట్టి చర్మం కి సంబంధించిన వ్యాధులు ఎలాంటివి రాకూడదు అనుకున్న వారు.. టమాటా చారు తాగడం మంచిది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు టమాటా చారుని దూరం పెట్టడం మంచిది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు చింతపండు రసం తాగడం మంచిది. కానీ చింతపండు వల్ల.. చర్మవ్యాధులు కొన్ని రావచ్చు. కాబట్టి చర్మవ్యాధుల సమస్యలు ఉన్నవారు చింతపండు రసం కి దూరంగా ఉండటం మంచిది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.