కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగిస్తారు. వీటికి బదులుగా ఆయుర్వేద నూనెలు వినియోగించడం చాలా మంచిది.
ప్రస్తుతం చాలామందిలో ఈ కీళ్ల సమస్యలు వస్తున్నాయి. అయితే పూర్వకాలంలో ఈ సమస్య 60 సంవత్సరాలలోపు వారిలో వచ్చేవని నిపుణులు చెబుతున్నారు.
ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లలోపు వయసు గల వ్యక్తులను కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.
బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ని కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని వినియోగించడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆవనూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం నొప్పి ప్రభావిత ప్రాంతంలో ఈ ఆయిల్ ను అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆలివ్ ఆయిల్ ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
కీళ్ల నొప్పులు ఉన్న ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెతో మసాజ్ చేసిన సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తాయి.
ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికమవుతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని కీళ్ల నొప్పులు ఉన్నచోట అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల మంచి అనుభూతిని చెందుతారు.
ఈ ఇంటి చిట్కాలు అనుసరించే క్రమంలో తప్పకుండా వైద్యుల సూచనలు సలహాలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందించిన సమాచారం కేవలం వైద్యులు సూచించినది మాత్రమే. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు.