పండిన అరటిపండు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి ఇందులో ఉండే గుణాలు చర్మానికి పోషణను ఇస్తాయి.
పండిన అరటి పండును ముఖానికి ఎలా అప్లయ్ చేసుకోవాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
అరటిపండును చర్మంపై అప్లయ్ చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. డ్రైనెస్ సమస్యను దూరం చేస్తుంది. నిర్జీవ చర్మాన్ని అందంగా మారుస్తుంది.
అరటిపండును ముఖానికి అప్లయ్ చేస్తే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది ముఖానికి మెరుపును ఇస్తుంది. చర్మం మునుపటి కంటే కాంతివంతంగా మారుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అరటిపండును ముఖానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది.
అరటిపండులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిచేలా చేయడంలో సహకరిస్తాయి. చర్మంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.
అరటిపండులో ఉండే పోషకాలు చర్మంపై ఉన్న అదనపు నూనెను తొలగిస్తాయి. ముఖంపై ఉన్న మొటిమలు, దద్దుర్ల సమస్య తగ్గుతుంది.
అరటిపండును ముఖానికి అప్లయ్ చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్ సమస్య కూడా తొలగిపోతుంది.
పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరటిపండుతో చేసిన ఈ ఫేస్ మాస్క్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని వారానికి రెండు మూడు సార్లు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.