అయితే ఆర్గుమెంట్స్ ఇద్దరి మధ్యా బంధాన్ని పెంచేవిలా ఉండాలి. లేదంటే విషయం తారా స్థాయికి చేరుకుంటుంది.
కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద ఆర్గుమెంట్స్ జరుగుతూ ఉంటాయి.
అలాంటి సమయంలో ఏది పడితే అది చేయటం మంచి పద్దతి కాదు. అలా చేస్తే బంధం తేగే అవకాశం ఉంటుంది.
ఆర్గుమెంట్స్ జరిగినపుడు ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మీ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
ఆర్గుమెంట్స్ జరగినప్పుడు కొంత గ్యాప్ వస్తుంది. దీని కారణంగా కోపం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వారి మూడ్‌ను బట్టి ఎంత సమయం అవసరమో గుర్తిస్తే సరిపోతుంది.
బంధాలు విడిపోవటానికి ముఖ్య కారణం కమ్యూనికేషన్ గ్యాప్. ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని సరిగా వినకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి. ఆర్గుమెంట్స్ తర్వాత కమ్యూనికేట్ చేయకపోతే ఉన్న బంధం కూడా దెబ్బతింటుంది.
తప్పు ఎవరిదైన క్షమాపణ చెప్పటానికి సిద్దంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి తప్పు చేసి.. క్షమాపణ చెప్పినపుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.
రిలేషన్‌షిప్‌లో చాలా మంది జంటలు తరుచుగా గొడవలు పడుటుంటారు. గొడవలు జరగటం సర్వ సాధారణ విషయం అయినప్పటికీ భాగస్వాముల మధ్య ఏదోక విషయంలో ఆర్గుమెంట్స్ అవుతూనే ఉంటాయి.