శ్రీ రామ నవమి రోజున దాదాపు అందరు బెల్లం పానకం ను ఇంట్లో తయారు చేసుకుంటారు
శ్రీరాముడికి, సీతమ్మ వారికి బెల్లంపానకం అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు
పానకంను ఇంట్లో కేవలం ఐదు నిముషాలలో చేసుకొవచ్చు
పానకంకు తయారీకి బెల్లం, మిరియాలు, శోంఠి, ఏలకులు రెడీగా పెట్టుకొవాలి
మొదట బెల్లం ను మెత్తగా తురుముకొని, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో వేయాలి
నీళ్లలో బెల్లమంతా కరిగి పోయే వరకు ఒక ఐదు నిముషాల పాటు వేచి ఉండాలి
అప్పటి వరకు మిరియాలు, శోంఠి, ఏలకులను మెత్తగా పౌడర్ లాగా దంచుకొవాలి..
ఈ పౌడర్ ను తీసుకుని, బెల్లం వేసిన నీళ్లలో వేసి గరిటెతో మిక్స్ చేయాలి.
దీనిలో తులసీ ఆకులు, నిమ్మ రసం కూడా వేస్తే మరింత టెస్టీగా ఉంటుంది.
ముఖ్యంగా సమ్మర్ లో పానకం తాగడం వల్ల వేడి సమస్యలు దూరమౌతాయి