ఉప్మా రవ్వతో చేసే గులాబ్ జామ్ ఒక్కసారి తింటే..ఇక మీరు తప్పకుండా వదలరు. మరి ఈ స్వీట్ తయారీ విధానం మీకోసం
ఈ గులాబ్ జామ్ తయారీ విధానం కోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి రెండు కప్పుల చక్కెరను వేయాలి.
ఈ చక్కెరను నీళ్లు పోస్తూ సిరప్ వచ్చేవరకు కలపాలి. ఈ సిరప్ లోనే అర స్పూను యాలకుల పొడి, ఒక స్పూను పాలు వేసి స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని.. రెండున్నర కప్పు రవ్వ వేసుకొని గోల్డ్ రంగు వచ్చేవరకు వేయించుకోండి.
ఈ మిశ్రమంలోనే పాలు, యాలకుల పొడి, పంచదార వేసి చిన్న మంట మీద హల్వా లాగా దగ్గరగా అయ్యేవరకు కలుపుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అరచేతికి కాస్త నూనె రాసుకొని రవ్వ ముద్దను తీసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి.
మళ్లీ స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకొని.. రవ్వతో చేసిన బాల్స్ ను అందులో వేసి గోల్డెన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు ఈ బాల్స్ ని తీసుకొని ముందుగా చేసిన చక్కెర సిరప్ లో వేసి.. ఒక అరగంట వదిలేయండి.
అంతే అరగంట తరువాత తింటే.. ఎంతో మృదువుగా ..రుచిగా ఉండే ఆరోగ్యకరమైన గులాబ్ జామ్ రెడీ..