మిగిలిపోయిన పూరీలతో.. ఎంతో రుచికరమైన లడ్లు చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..
ముందుగానే గోధుమ పిండితో 10 పూరీలను చేసుకోండి.
ఈ పూరీలను మిక్సీలో వేసుకొని.. మెత్తగా పొడిలా చేసుకోండి..
ఇప్పుడు ఒక మిక్సీలో మూడు కప్పుల పంచదారను కూడా వేసి పొడిలా చేసుకోండి.
ఆ తరువాత స్టవ్ పైన పెద్ద కళాయి పెట్టి.. కొంచెం నెయ్యి వేసి..అందులో గుప్పెడు జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఆ కళాయిలోనే పూరీ పొడి.. పంచదార పొడి.. వేసి బాగా కలుపుకోండి.
అందులో కొద్దిగా.. యాలకుల పొడిని చల్లుకొని.. మొత్తం మిశ్రమం. దగ్గరగా వచ్చేవరకు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ కట్టేసి.. ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా.. చుట్టుకుంటే.. పూరి లడ్డు రెడీ.