చపాతీ తో ఏదైనా రుచికరమైన కూర తినాలి అనుకుంటున్నారా.. అయితే ఈ జీడిపప్పు టమాటా కర్రీ విధానం మీకోసం..
ముందుగా పాన్ వేడి చేసి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే కప్పు జీడిపప్పు వేసి కాసేపు వేయించాలి.
జీడిపప్పు తీసి పక్కన పెట్టుకున్నాక.. మళ్లీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. వేరయ్యాక కరివేపాకు వేయాలి.
ఆ తర్వాత కొద్దిగా లవంగాలు, జీలకర్ర గింజలు వేసుకోవాలి. కాసేపటికి కారం పొడి, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా అల్లం-వెల్లుల్లిని వేయాలి.
ఆ తరవాత నాలుగు టమాటాలు గ్రహించేసి ఆ పేస్ట్ ని ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి.
ఆపై కొద్దిగా ధనియాల పొడి, కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కొంచెం నీరు పోసి మరిగించాలి.
అనంతరం కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి కలపాలి. ఇప్పుడు మెంతిపొడి వేసుకోవాలి. చివరగా వేయించిన జీడిపప్పు వేస్తే టొమాటో జీడిపప్పు గ్రేవీ సిద్ధం.