ఈ రోటీలు తింటే సూపర్ స్పీడ్‌గా బరువు తగ్గడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Nov 21,2024
';

చాలామంది పాలకూరను తినేందుకు అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అయితే దీనిని అస్సలు తినరు.

';

పాలకూరలో వివిధ రకాల పోషకాలు ఉన్నప్పటికీ.. తినేందుకు అంతగా ఇష్టపడని వారు ఈ రెసిపీతో ఇట్టే తింటారు..

';

పాలకూరతో తయారుచేసిన రోటీలను రోజు తినడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి మెగ్నీషియంతో పాటు పొటాషియం అందించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

బరువు తగ్గే క్రమంలో పాలకూరతో తయారుచేసిన రోటీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

క్రమం తప్పకుండా పాలకూరను తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా పొట్ట సమస్యలు కూడా తొలగిపోతాయి.

';

ఇంట్లోనే పాలకూర రోటీలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇప్పుడే తయారు చేసుకోండి.

';

పాలకూర రోటీలకు కావలసిన పదార్థాలు: 2 కప్పుల పాలకూర (తురిమిన), 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బేసన్, 1/2 అంగుళం అల్లం (ముక్కలుగా కట్ చేసుకున్న), 2 పచ్చి మిరపకాయలు (తురిమినవి)

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా ఈ పాలకూర రోటీలను తయారు చేసుకోవడానికి.. పాలకూర ఆకులను తీసుకొని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా శుభ్రం చేసుకున్న ఆకులను మిక్సీ గ్రైండర్ లో వేసి మిశ్రమంలో తయారు చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఓ బౌల్లోకి తీసుకొని అందులోనే గోధుమపిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి.

';

ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే జీలకర్ర, తగినంత పసుపు, కాస్తంత కారం, పసుపు వేసుకొని నెమ్మదిగా నీరు పోసుకుంటూ రోటీల పిండి మిశ్రమంలా కలుపుకోండి.

';

ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని.. రోటిలాగా తయారు చేసుకుని నాన్ స్టిక్ పెయిన్ పై రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు కాల్చుకోండి.

';

ఇలా కాల్చుకున్న రోటీలను సలాడ్‌తో లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story