హెయిర్ ఫాల్ తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బాధ పడేది తెల్ల వెంట్రుకల వల్లే. అలా తెల్ల వెంట్రుకలు కనిపించకుండా కొందరు కలర్ వేయిస్తూ ఉంటారు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు.
మరి తెల్ల వెంట్రుకలు తగ్గడానికి నిజంగానే ఉపయోగపడే కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయా అంటే అవును అనే చెప్పాలి. మన ఇంట్లో ఉండే రెండే రెండు పదార్థాలతో మన జుట్టు లో ఉన్న తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు ధృడంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.
తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడానికి ఎన్నో కెమికల్స్ వాడి విసిగిపోయారా? తెల్ల వెంట్రుకల కోసం మీరు వెతుకుతున్న మందు మీ ఇంట్లోనే ఉంది. ప్రతి ఇంట్లో దొరికే రెండు పదార్థాలు మన తెల్ల వెంట్రుకలను బాగా తగ్గిస్తాయి. అందులో ఒకటి లవంగాలు కాగా మరొకటి బ్లాక్ టీ.
లవంగాల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టే మన జుట్టుకి కూడా ఈ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలలో ఉండే యుజినాల్ మన జుట్టుని రిపైర్ చేసి సరికొత్త గ్లో ని తీసుకువస్తుంది.
బ్లాక్ టీ లో గ్రే హెయిర్ ను కూడా తగ్గించే లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా జుట్టుని మరింత అందంగా, నిగనగాలాడేలా కూడా చేస్తుంది.
ఒక గిన్నె లో రెండు కప్పుల నీళ్ళు తీసుకుని అందులో అయిదు లేదా ఆరు లవంగాలు పొడిగా చేసుకుని వేసుకోవాలి. అందులో కొంచెం టీ పొడి కూడా వేసి సిమ్ లో పెట్టి కాసేపు మరిగించాలి. నీళ్లు సగం అయ్యాక ఆ మిశ్రమాన్ని వడగట్టి చల్లార్చాలి అంతే.
ఆ నీటిని డైరెక్ట్ గా జుట్టుకి అప్లై చేసుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయడం వల్ల కొద్ది కాలం లోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది.