ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్ వినియోగించేవారే. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ మర్చిపోతే ఎలా రికవర్ చేయాలో తెలుసుకుందాం..
ముందుగా మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి
లాగిన్ బటన్ దిగువన మరో ఆప్షన్ కన్పిస్తుంది. ఒక్కొక్క ఫోన్‌లో ఒక్కోలా ఉండవచ్చు
స్మార్ట్‌ఫోన్‌లో Get help logging inగా ల్యాప్‌టాప్‌లో అయితే Forget Password అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి.
ఆ తరువాత మీకు కొత్త పేజ్ ఓపెన్ అయి కన్పిస్తుంది.
ఇక్కడ మీ యూజర్ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తరువాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కన్పించే సూచనలు పాటించాలి.
ఇప్పుడు మీరిచ్చిన వివరాల ఆధారంగా పాస్‌వర్డ్ రీసెట్ లింక్ వస్తుంది.
మీ ఫోన్ లేదా మెయిల్ ఐడీకు పాస్‌వర్డ్ రీసెట్ లింక్ వస్తుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఉంటుంది.
ఈ లింక్ క్లిక్ చేసి పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవాలి. అంతే చాలా సులభంగా మీ పాస్‌వర్డ్ రీసెట్ అయిపోతుంది.