Snakes Facts: పాములు ఎలా నిద్ర పోతాయో తెలుసా..
పాముల గురించి మన దగ్గర చాలా అపోహలున్నాయి. కనురెప్పలే లేని పాములు ఎలా నిద్రిస్తాయని అందరి మదిలో ఓ సందేహం ఉంది. అసలు పాములు ఎలా నిద్రపోతాయో తెలుసుకుందాం..
పాము సగటున 8 నుంచి 10 యేళ్లు జీవిస్తాయి. పాములు కూడా అలసట చెందిన సమయంలో నిద్రపోతుంటాయి.
కనురెప్పలు లేనపుడు పాములు ఎలా నిద్రపోతాయనే సందేహం మనలో తెలెత్తటం సహజం.
పాములు రోజుకు సగటున 16 గంటల వరకు నిద్రపోతాయని పరిశోధనల్లో తేలింది.
పాములు ఎక్కువగా పగటి పూట నిద్రిస్తుంటాయి. దీంతో రాత్రి పూట పాములు ఎంతో చురుకుగా వ్యవహరిస్తాయి.
పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి.. కళ్లు తెరిచే నిద్రపోతాయి. కనురెప్పలు తెరిచే ఉంచడం వలన చూసే వాళ్లకు పాములు మనపై దాడి చేస్తాయనే భయం చూసే వాళ్లలో ఉంటుంది.
కొన్ని రకాల పాములు 22 గంటలు నిద్రపోతుంటాయి. పాములు ఎక్కువగా చెట్లపై ముడుచుకొని నిద్రపోతాయి.
పాముల కళ్ల చుట్టూ పొలుసులతో ఎవరికీ కనపడని ఓ పలుచటి పొర ఉంటుంది. అవే పాము కళ్లను సహజసిద్ధంగా ఉండేలా చేస్తుంటాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాము మెదడు పని చేయడం ఆగిపోతుంది.