నిద్రలో పడే కలలను బట్టి జీవితంలో పాజిటిట్ లేదా నెగేటివ్ ఫలితాలు ఉంటాయంటారు
కలలో పాములు కన్పిస్తే రాహు,కేతు దోషాలను సూచిస్తుందని చెబుతారు.
ఇక కలలో ఏనుగు లేదా గుర్రం కన్పిస్తే రాజయోగానికి అవకాశం ఉందని చెబుతుంటారు.
వచ్చే కాలంమంతా ఎంతో కలిసి వస్తుందని ఏపనిచేసిన కూడా సక్సెస్ అవుతుందని చెబుతుంటారు.
ఏదైన ప్రమాదాలు జరిగినట్లు కల పడితే ఆవ్యక్తి లైఫ్ లో రానున్న రిస్క్ నుంచి బైటపడ్డట్లు అని చెబుతారు.
అంటే ఆ వ్యక్తికి వచ్చిన పెద్ద ప్రమాదం తప్పిపోయారని జ్యోతిష్యులు చెబుతుంటారు.
కలలో కనుక చెట్లు నాటుతున్నట్లు, చెట్ల కింద ఉన్నట్లు కనపడితే.. మంచియోగం కల్గుతుంది.
ఇక కలలో ఎవరైన మలంలో కనపడితే జీవితంలో అస్సలు ఊహించని ధనంసొంతమౌతుందంట.