ప్రముఖ మొబైల్ కంపెనీ వీవో తమ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ గురువారం మార్కెట్లోకి విడుదలైంది. ఫీచర్స్ వివరాలు ఇవే.
ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్పష్టమైన, స్మూత్‌గా టచ్చింగ్ ఫీల్‌ను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్ Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం బాగా పని చేస్తుంది.
ఈ మొబైల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి చాలా బాగుటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం బాగా వర్క్ చేస్తుంది.
ఇక ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. కాబట్టి లాంగ్ లైఫ్ బ్యాటరీని ఇస్తుంది.
త్వరగా ఫోన్‌ను చార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మల్టీటాస్కింగ్ కోసం 8GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది.
తక్కువ ధరలోనే ఈ మొబైల్ 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది..తాజా Android ఫీచర్లతో లభిస్తోంది.
సురక్షితమైన లాక్ అన్‌లాక్ కోసం In-display ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.