రేవంత్ రెడ్డి ఏడుగురు అన్నదమ్ముళ్లు ఎవరు? రేవంత్ కవల సోదరుడు ఎవరు?
నవంబర్ 8వ తేదీన రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రేవంత్ రెడ్డి కుటుంబం చాలా పెద్దది. అతడికి ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉండేది. రేవంత్ పుట్టినరోజు సందర్భంగా అతడి సోదరుల పేర్లు, వారి వృత్తి ఏమిటో తెలుసుకుందాం.
రేవంత్ రెడ్డి సోదరుల్లో పెద్దన్న భూపాల్ రెడ్డి. ఈయన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ పొందారు.
రెండో సోదరుడు కృష్ణా రెడ్డి. ఈయన గ్రామ సర్పంచ్‌గా పని చేశారు.
ఈయన పేరు ప్రస్తుతం రాజకీయాల్లో మార్మోగుతోంది. తిరుపతి రెడ్డి పూర్తిగా రాజకీయాల్లో ఉన్నాడు. రేవంత్‌కు పూర్తి అండగా ఉంటున్న తిరుపతి రెడ్డిపై కొన్ని వివాదాలు ఉన్నాయి.
విదేశాల్లో స్థిరపడిన సోదరుడు జగదీశ్ రెడ్డి. ఇటీవల ఈయన కంపెనీకి సంబంధించిన ఒప్పందం విషయమై తీవ్ర వివాదాస్పదమైంది.
మరో సోదరుడి పేరు కూడా కృష్ణా రెడ్డి. ఈయన హైదరాబాద్‌లో వ్యాపారంలో బిజీగా ఉన్నారు.
రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి. రేవంత్, కొండల్ ఇద్దరు కవలలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్న కొండల్ రెడ్డి రేవంత్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అతడి సోదరులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పరిపాలనలో రేవంత్ సోదరులు కలగజేసుకోవడం.. హైడ్రాలో తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టకపోవడం.. కాంట్రాక్టులు ఇవ్వడం వంటివి రేవంత్‌కు చెడ్డపేరు తీసుకొస్తున్నాయి.