Budget 2024: మధ్యంతర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తారీకున లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయాలు ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో ఇప్పుడు చూద్దాం.
పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం అలానే ప్రపంచ స్థాయిలో మార్కెట్ చేయడానికి ప్రభుత్వం రాష్ట్రాలను ప్రోత్సహించనుంది.
మిడిల్ క్లాసులో పన్ను చెల్లింపుదారుల చేతిలో ఎక్కువ డబ్బును అందించడానికి, వినియోగాన్ని పెంచడానికి పన్ను రేట్ల పరిమితిని ప్రభుత్వం పెంచింది.
కేంద్రం పాడి రైతుల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా మత్స్య రంగంలో ఉత్పాదకతను పెంచడానికి ఖర్చును కూడా వేగవంతం చేస్తుంది.
వచ్చే సంవత్సరానికి మూలధన వ్యయాన్ని 11.1 శాతం పెంచి రూ. 11,11,111 కోట్లు చేసింది. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని కేంద్రం తెలిపారు. అయితే ఇది అంచనాలకంటే చాలా తక్కువగా ఉంది.
బంగారంపై దిగుమతి పన్నును ప్రభుత్వం 15 శాతం అధిక స్థాయిలో ఉంచడంతో ఎన్నో జ్యువెలరీ స్టాక్స్ గురువారం పడిపోయాయి. భారతదేశం దాదాపు ఎంతో బంగారం వినియోగానికి దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ది చేయాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ సంవత్సరం మార్చి నెలలో ముగిసే 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ కార్యక్రమాన్ని మాత్రం పొడిగించలేదు.