పాలకూర.. బోలెడు ప్రయోజనాలు !
పాలకూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. నిజానికి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలకూరలో ప్రోటీన్లు, పిండి పదార్థం ,ఫైబర్లు ఉంటాయి. కాబట్టీ పాలకూర తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందుతాయి.
పాలకూర లో ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరంలో రోగిరోధక శక్తిని పెంచి , ఇన్ఫెక్షన్స్ ని తదితర రోగాలను దీటుగా ఎదుర్కునేలా చూస్తుంది.
గుండె సంబంధిత వ్యాధి అనగా హార్ట్ ఎటాక్ తో బాధపడుతున్నవారు పాలకూర తీసుకోవడం వల్ల గుండె పదిలంగా ఉంటుంది.
చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు పాలకూర తినడం వల్ల కిడ్నీ లో రాళ్ళు పోవడమే కాకుండా, కిడ్నీ పనితీరు ను కూడా మెరుగుపరుస్తుంది.
పెద్దలు షుగర్ వ్యాధి తో బాధపడుతుంటారు. అలాంటివారు పాలకూర తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి వస్తుంది.
పాలకూర లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు పాలకూర తింటే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరిగి శరీరం లో హీమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.
అనీమియా వ్యాధి తో బాధ పడుతున్నవారు పాలకూర తీసుకుంటే చక్కని ఉపశమనం లభిస్తుంది.
పాలకూర తీసుకుంటే బ్లడ్ కేన్సర్ రాకుండా కాన్సర్ కణాలను అడ్డుకుంటాయి.