ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇతడు ఇప్పటి వరకు మెుత్తంగా మొత్తం 241 సిక్సర్లు కొట్టాడు.
ఇప్పటి వరకు తొలి స్థానంలో క్రిస్ గేల్ రెండో స్థానికి దిగజారిపోయాడు. అతడు బెంగళూరు తరపున 239 సిక్సర్లు బాదాడు.
ఇక మూడో డివిలియర్స్ ఉన్నాడు. అతడు ఆర్సీబీ తరపున 238 సిక్సర్లు నమోదు చేశాడు.
మిగిలిన బ్యాట్స్‌మెన్ 100 లోపు ఉన్నారు. ఈ ముగ్గురు మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా RCB తరపున 100 సిక్సర్లు కొట్టలేకపోయారు.
ఆర్సీబీ నుండి గ్లెన్ మాక్స్‌వెల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున అతను ఇప్పటివరకు మొత్తం 67 సిక్సర్లు బాదాడు.
ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్ 50 సిక్సర్లు పూర్తి చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ విరుచుకుపడ్డాడు: 59 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు.
నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు మంచి స్కోరు సాధించినప్పటికీ ఓటమి మాత్రం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్‌పై కూడా విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 77 పరుగులు చేశాడు.