Vitamin B12 Foods: మీ డైట్లో ఈ మూడు పదార్ధాలుంటే చాలు విటమిన్ బి లోపమే ఉండదు
విటమిన్ బి12 అనేది శరీరానికి చాలా అవసరం. వివిధ రకాల పనులు చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి, నాడీ వ్యవస్థ ఆరోగ్యం, డీఎన్ఏ పనితీరులో కీలకంగా ఉపయోగపడుతుంది
మానవ శరీరం విటమిన్ బి12 ఉత్పత్తి చేయదు. అందుకే ఆహారం ద్వారా అవసరమైన విటమిన్ బి12 సమకూర్చుకోవల్సి ఉంటుంది.
విటమిన్ బి 12 శరీరంలో 300pg/ml దాటి ఉండాలి. అప్పుడే అది నార్మల్ లెవెల్. అదే 200pg/ml కంటే తగ్గితే లోపమున్నట్టే
విటమిన్ బి 12 శరీరంలో 300pg/ml దాటి ఉండాలి. అప్పుడే అది నార్మల్ లెవెల్. అదే 200pg/ml కంటే తగ్గితే లోపమున్నట్టే
విటమిన్ బి12 లోపముంటే చేతులు కాళ్లు త్వరగా తిమ్మిరెక్కుతుంటాయి. అంతేకాకుండా ముఖం పసుపుగా మారుతుంటుంది. చర్మం డ్రై అవుతుంటుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ముూడ్ సరిగ్గా ఉండదు. విసుగు ఉంటుంది.
విటమిన్ బి12 లోపం సాధారణంగా శాకాహారుల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మూడు రకాల పదార్ధాలు డైట్లో ఉంటే శాకాహారులకు సైతం ఈ సమస్య తలెత్తదు
న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది బెస్ట్ ఫుడ్. ఇందులో విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్ బి1 ఎక్కువగా ఉంటాయి. న్యూట్రిషనల్ ఈస్ట్‌ను వివిధ వంటల రూపంలో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.
పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీరులో విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటుంది. రోజువారీ కావల్సినంత విటమిన్ బి12 దొరుకుతుంది.
సీవీడ్స్‌లో కూడా విటమిన్ బి12 కావల్సినంతగా ఉంటుంది. జపాన్, కొరియా ప్రజల వంటల్లో ఇది తప్పకుండా ఉంటుంది