Detox Juice: ఈ రెండు పదార్ధాల జ్యూస్ నెల రోజులు తాగితే మొత్తం బాడీ డీటాక్స్
ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్య శరీరంగానే కాదు..అంతర్గతంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి.
లివర్ అనేది జీర్ణక్రియకే కాకుండా శరీరంలో అత్యంత కీలకమైన అంగం
జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా లివర్‌లో చెప్పలేనంత వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. చాలా సమస్యలు చుట్టుముడుతుంటాయి.
మీ లివర్‌ను సహజసిద్ధమైన పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉంచాలన్నా, రక్త హీనత లేకుండా చేయాలన్నా కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి
దీనికోసం మీరు క్యారట్, బీట్రూట్ జ్యూస్ తాగాలి. దీనివల్ల లివర్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా హిమోగ్లోబిన్ పెరుగుతుంది
క్యారట్, బీట్రూట్ జ్యూస్‌లో ఏంథోసయానిన్, కైరోటినాయిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటానిన్, ఫినోల్ వంటి గుణాలుంటాయి.
క్యారట్లో బీటా కెరోటిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ కింద మారుతుంది. లివర్‌ను హెల్తీగా ఉంచుతుంది.
ఇది విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడుతుంది. దాంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది. Detox Drink