టిఫిన్ లోకి ఎంతో రుచికరంగా ఉండే టమాటా చట్నీ తయారీ కోసం.. ముందుగా స్టవ్ పైన.. పాన్ పెట్టి.. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి.
అందులో సన్నగా తరిగిన అరకప్పు ఉల్లిపాయలు వేగించి, సన్నగా కట్ చేసిన మూడు టమాటా ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించండి.
ఒక రెండు నిమిషాల తరువాత.. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టేయండి.
ఒక ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమం ఉడికిన తరువాత.. స్టవ్ ఆపేసి.. చల్లార్చుకొని.. ఆ మిశ్రమంలో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి.
ఇప్పుడు మళ్లీ స్టౌ పైన పాన్ పెట్టి రెండు స్పూన్ల్ ఆయిల్ వేయండివేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసుకోండి.
అవి బాగా వేగాక ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని వేసి కాసేపు ఉడకనివ్వండి.
ఈ మిశ్రమం మొత్తం బాగా చిక్కగా అయ్యేవరకు అలానే ఉంచండి. అంతే ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ. టిఫిన్స్ లోకి ఈ చట్నీ తింటే ఆహా అనాల్సిందే.