చేపల పులుసుకి సమానంగా ఎంతో రుచికరంగా ఉండే.. ఆనియన్ పులుసు తయారీ విధానం కోసం..ముందుగా స్టవ్ పైన.. కడాయి పెట్టుకుని అందులో చెంచా నూనె వేసుకోవాలి.
అందులో ఒక స్పూను ధనియాలు, గుప్పెడు ఎండుమిర్చి, పావు స్పూను మిరియాలు, మెంతులు వేసి బాగా వేయించుకోండి. అందులోనే కొబ్బరి తురుము కూడా వేసి రంగు మారేవరకు వేయించండి.
ఆ తరువాత వీటిని చల్లార్చి.. నీళ్లు పోసుకుంటూ మిక్సీలో వేసి పేస్టులా చేసుకోండి.
ఇప్పుడు మళ్లీ అదే కడాయిలో.. ఇంకొంచెం నూనె వేసుకొని.. మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. అందులోనే బాగా చెక్కు తీసి పెట్టుకున్న.. పావు కేజీ చిన్న ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి.
రెండు నిమిషాల తరువాత.. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు.. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.
ఆ తరువాత కొద్దిసేపటికి కొంచెం చింతపండు రసం, బెల్లం వేసుకోవాలి. పావు గంటసేపు ఈ మిశ్రమాన్ని సన్న మంటపైన బాగా ఉడికించుకోండి
ఆ తరువాత ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మసాలా మిశ్రమాన్ని వేసుకుని కలపాలి. కూర చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోండి. ఇక ఈ కొబ్బరి మిశ్రమం పచ్చివాసన పోయేవరకు.. ఉడికితే చాలు ఎంతో రుచికరమైన.. ఆనియన్ పులుసు రెడీ.