ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు ఎదురౌతుంటాయి. ఈ వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే డైట్లో కొన్ని పదార్ధాలు తప్పకుండా ఉండాలి
సాధారణంగా ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటే వ్యాధులు చాలా సులభంగా చుట్టుముడుతుంటాయి.
సాధారణంగా పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుంది. అందుకే డైట్లో కొన్ని రకాల పదార్ధాలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది.
ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు డైట్లో ఎలాంటి ఆహార పదార్దాలు చేర్చాలో తెలుసుకుందాం
పుల్లటి పదార్ధాలు డైట్లో తప్పకుండా ఉండాలి. ఫలితంగా చాలా రకాల విటమిన్లు అందుతాయి. నిమ్మ, ఆరెంజ్, బత్తాయి వంటి ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి
రెడ్ షిమ్లా మిర్చి డైట్లో చేర్చడం వల్ల బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది.
తులసి ఆకులతో టీ లేదా తులసి నీళ్లు తాగడం వల్ల ఇమ్యూనిటీ చాలా వేగంగా పెరుగుతుంది.
అల్లంలో యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వెల్లుల్లిని డైట్లో తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాలు వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి.