దూసర తీగ గురించి ఊళ్లో ఉండేవారికి బాగా తెలుస్తుంది. ఈ దూసర తీగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దూసర ఆకులతో తయారు చేసిన పసరును ఒక గ్లాసులో పోసి 5 గంటలపాటు అలాగే ఉంచాలి. అది జెల్ లాగా తయారు అవుతుంది. అందులో కొద్దిగా పటిక బెల్లం కలిపి తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
కొంతమందికి కళ్లమంట, కళ్లదురద, కంటి రెప్పలపై కురుపులు వస్తుంటాయి. అలాంటి వారు దూసర తీగను దంచి ఆ రసాన్ని కను రెప్పలపై రాయాలి.
చర్మ సమస్యలకు దూసర తీగ ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, గజ్జిలాంటి సమస్యలకు ఈ ఆకుల రసాన్ని రాయాలి.
డయాబెటిస్ తో బాధపడేవారు కూడా దూసర ఆకులను వాడొచ్చు. గుప్పెడు ఆకులను తీసుకుని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ నీటిని రోజూ తాగితే బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది.
ఈ ఆకుల రసాన్ని రోజూ తాగితే స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమస్యలకు చెక్ పెడుతుంది. సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
దూసర తీగను రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పాతాళ గరుడి, సిప్పితీగ, చీపురు తీగ, గరుడ తీగ వంటి పేర్లతో పిలుస్తుంటారు.
మాకు ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఈ కథనం రాసాము. ఏదైనా ప్రయత్నం చేసే ముందు వైద్యులను సంప్రదించండి.