మనం ఫాలోఅయ్యే జీవనశైలికి ఆరోగ్యకరమైన టిఫన్ ఎంతో ముఖ్యం.. మరి రుచికిరుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే గ్రీన్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం..
ఇందుకోసం కావలసిన పదార్థాలు ఒక కప్పు..కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, బియ్యం.. అలానే అర కప్పు.. కరివేపాకుల తురుము, మినప్పప్పు, ఒక ఉల్లిపాయ, ఒక స్పూన్ మెంతులు, జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి అలానే తగినంత ఉప్పు, నూనె.
ముందుగా బియ్యం, మినప్పప్పు, మెంతులు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
తరువాత వాటన్నిటిని మిక్సీలో వేసి పిండిలా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ పిండిలో మెత్తగా రుబ్బుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పేస్టుని.. అలానే జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. దానిపై మనం కలుపుకున్న పిండిని దోశలా పోసుకోవాలి. పైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును చల్లుకోవాలి.
అంతే ఎంతో మంచిదైన గ్రీన్ దోశ రెడీ. ఈ టిఫన్ వల్ల షుగర్ బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.