మనం అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడని విటమిన్స్ లో విటమిన్ డి ఒకటి. మరి ఇది మన శరీరంలో లోపిస్తుందో లేదో తెలియాలి అంటే.. మీలో కింద చెప్పిన సింటమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా చూసుకోండి..
కండరాల నొప్పి: కండరాల నొప్పి మరీ ఎక్కువగా ఉంది. కదలడానికి కూడా కష్టమవుతోంది అంటే మన శరీరంలో సరిపడా విటమిన్ డి లేనట్టే.
డిప్రెషన్: మన మెదడు పనితీరుని నియంత్రించగల శక్తి విటమిన్-డి కి ఉంటుంది. కాబట్టి మెదడు సరిగ్గా పనిచేయకుండా.. మీరు తరచూ డిప్రెషన్ కి లోనవుతున్న విటమిన్ డి లోపించినట్టు అర్థం..
నీరసం: విటమిన్ డి తగ్గితే మీరు చిన్న పని చేసినా కూడా త్వరగా నీరసం వస్తూఉంటుంది
బోన్ నొప్పి: విటమిన్ డి, కాల్షియం కలిసి మన ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడతాయి. కాబట్టి ఒకవేళ ఎముకలు బాగా నొప్పి వస్తూఉన్నా.. లేకపోతే నడుము నొప్పి వస్తూఉన్న విటమిన్ డి లోపించినట్టే.
జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది.. మీరు తప్పకుండా విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది.
విటమిన్-డి తక్కువగా ఉంటే రోగ నిరోధక తగ్గిపోతుంది. ఇక దీనివల్ల చీటికి మాటికి జలుబు చేయడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.
బరువు పెరిగిపోవడం: విటమిన్-డి తక్కువగా ఉంటే.. బరువు ఎక్కువగా పెరిగి అవకాశాలు ఉన్నాయి. అందుకే విటమిన్ డి లోపించినట్టయటే మనం దాన్ని తేలిక తీసుకోకూడదు..