రుచికరమైన అలానే ఆరోగ్యకరమైన పాలకూర పూరీ తయారీ విధానం కోసం..ముందుగా ఒక కట్ట పాలకూరను బాగా కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలి.
ఆ తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి.. ఈ పాలకూర వేసుకొని..అందులో పావు కప్పు నీళ్లు పోసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర, సగం చెంచా పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
అందులోనే పావు స్పూను వాము, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముద్ద, చెంచా నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి.. అన్ని సమానంగా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు పోసుకుంటూ.. పూరి పిండిలా కలుపుకోండి.
ఈ పిండి పైన పావుగంటసేపు తడిగుడ్డ కప్పేసి పక్కన పెట్టేయండి. ఆ తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని... పూరీలు ఒత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడెక్కాక.. మనం రుద్దుకున్న పూరీలు వేసుకోవాలి.
ఒక వైపు పొంగాక మరో వైపు వేసుకొని.. కాస్త రంగు మారేవరకు వేయించుకుంటే చాలు.. ఎంతో రుచికరమైన పాలకూర పూరి రెడ్డి.