నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్నారు కానీ సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ హార్ట్ ఎటాక్ వచ్చే నెల ముందు నుండే మన శరీరం మనకి సంకేతాలు ఇస్తుందట.
ఈ లక్షణాలు ఏమైనా మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే గుండె పోటు ని నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు వచ్చే చాలా రోజుల ముందు నుంచి దవడలో నొప్పి ఉంటుంది. అది గుండెపోటు సమయంలో భరించలేనంతగా మారుతుంది.
ఉన్నపళంగా మెడ లో నొప్పి కూడా కొందరిలో వస్తుందట. కానీ మెడ నొప్పి ఎప్పుడూ ఉండేవారికి అది సంకేతం కాదని గుర్తించాలి.
ఎలాంటి కారణం లేకుండా సడన్ గా భుజం లో నొప్పి వచ్చినా అది గుండె పోటు సంకేతమే.
గుండె పోటు వచ్చే ముందు వెన్ను నొప్పి కూడా మన గుండె ఇస్తున్న పెద్ద సంకేతమే.
ఎలాంటి ఎసిడిటీ లేకుండా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే ఎలర్ట్ అవ్వాలి. గుండె పోటు వచ్చే నెల ముందు నుండే ఛాతీ నొప్పి మొదలవుతుంది.