హోలీ పండుగను చిన్న, పెద్దా తేడా లేకుండా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. కొందరు నేచురల్స్ రంగులు వాడితే, మరికొందరు కెమికల్స్ రంగులతో పండుగ జరుపుకుంటారు.
కానీ హోలీ పండుగ జరుపుకునేటప్పుడు కొన్నిజాగ్రత్తలు తీసుకొవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా జుట్టు, చర్మం, కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకొవాలి.
పండుగ రోజున ఉదయాన్నే తలకు మంచి నూనెను పెట్టుకొవాలి. శరీరంమంతా మర్దన చేసుకొవాలి. ఇలా చేసుకుంటే శరీరంకు అంటుకున్న రంగులు తొందరగా వెళ్లిపోతాయి.
ఇక కొందరు జుట్టులో రంగు పౌడర్ లు వేసుకుంటారు. ఈ పౌడర్ వెంట్రుకల కుదుళ్ల వరకు వెళ్లిపోతాయి. దీంతో వెంట్రుకలు చిట్లీపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
అందుకే హోలీ రోజున ఉదయాన్నే శరీరానికి కూడా నూనె, మాయిశ్చరైజేషన్ ను అప్లై చేసుకొవాలి. ఇలా చేస్తే ముఖంపై అలర్జీలు, దద్దుర్లు వంటివి రావడం తగ్గిపోతుంది.
ముఖంమీద మచ్చలు రావడం కూడా సంభవిస్తుంది. అందుకే హోలీ రోజున స్కిన్ మీద కాస్తంద కన్నేసి ఉంచాలి. లోదుస్తులతో రంగులు పోకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.
ఇక హోలీరోజున గోర్లు పెద్దగా ఉండకుండా చూసుకొవాలి. లేకుంటే గోర్లలో కెమికల్స్ చేరిపోతాయి. ఆరోజున మనం ఏదైన ఫుడ్ తింటే ఆ కెమికల్స్ నేరుగా మన పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ హోలీని ఎంతో జాగ్రత్తగా జరుపుకొవాలి. ముఖానికి రంగులు పెట్టేటప్పుడు కళ్లు, నోటిలోకి రంగులు పోకుండా చూసుకొవాలి.
హోలీరోజున కొత్త బట్టలు కాకుండా పాత బట్టలు వేసుకుని రంగులు ఆడాలి. ఆతర్వాత ఆ బట్టలను బయటే పాడేయాలి. ఇలా చేస్తే ఇతర బట్టలకు రంగులు అంటుకోవు.
ఇక హోలీ ఆడేటప్పుడు ఇల్లంతా రంగులు కాకుండా.. ఒక ప్రత్యేక గదిలో లేదా వరండాలో, పార్కులో హోలీని జరుపుకొవాలి.