లో బీపీ సమస్యలతో బాధపడేవారిలో అనేక తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ బీపీ సమస్య ఉన్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడేవారి శరీరంలో కొన్ని మార్పలు, లక్షణాలు కనిపిస్తాయి.
తరచుగా మూర్ఛపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.
కొందమందిలో తక్కువ రక్తపోటు కారణంగా తలలో చల్లగా అనిపిస్తుంది.
లో బీపీ కారణంగా తరచుగా అలసిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి.
కొంతమందిలో బీపీ కారణంగా చర్మం పసుపు రంగులోకి మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఎక్కువగా చెమట పట్టడం కూడా లో బీపీకి సంకేతాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొంతమందిలో తక్కువ రక్తపోటు కారణంగా నాడీ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
శరీర బలహీన, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కూడా లో బీపీకి కారణమవ్వొచ్చు.