రోజు ఇడ్లీ, దోశ తిని తిని అందరికీ బోర్ కొట్టడం సహజం. అయితే ఎన్నో రోగాలకి ఔషధంగా నిలిచే.. పాలకూర దశ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.
ముందుగా నాలుగు కప్పుల నీళ్లు వేడి చేసుకొని.. అందులో పసుపువేసి.. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో.. రెండు కప్పుల పాలకూర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసి 3-4 నిమిషాలు ఉడికించుకోండి
ఇప్పుడు నీటిని బాగా ఫిల్టర్ చేసుకొని.. పాలకూరను చల్లారనివ్వాలి.
ఆ తరువాత పాలకూర, పచ్చిమిర్చి, అల్లంను బాగా మెత్తగా రుబ్బుకోండి .
ఇప్పుడు ఈ పేస్టును దోశ బ్యాటర్ లో వేసి కలుపుకోండి.
ఆ తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి.. 1/2 టీస్పూన్ నెయ్యి మరిగించి, పిండిని దోస లాగా వేసుకోండి. లేత గోధుమ రంగు వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోండి.
అంతే ఎంతో రుచికరమైన పాలకూర దోశ రెడీ. ఈ దోశ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.