కరోనా వచ్చినప్పటి నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలీని కల్పించాయి.
గంటల తరబడి లాప్ టాప్ లముందు పనులు చేయడం ప్రారంభించారు.
దీంతో చాలా మంది నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
గంటల తరబడి ఒకే పోజిషన్ లో కూర్చుండటం వల్ల నడుము నొప్పి వస్తుంది.
వర్క్ చేసుకునే వాళ్లు గంటకు ఒకసారి తప్పకుండా లేచీ అటు ఇటు నడవాలి,
కంప్యూటర్ నుంచి విరామం తీసుకుని పదినిముషాల పాటు ధ్యానం,యోగా చేయాలి.
పనిచేస్తున్నప్పుడు టెబుల్ ను మీ తలకు సరైన పొజిషన్ లో ఉండేలా చూసుకొవాలి.
ఎక్కువగా కిందకు వంగి సిస్టమ్ లో తలదూర్చేసి కూర్చోకూడదు.