కొన్నిరోజులుగా భానుడు భగ భగ మండిపోతున్నాడు.
బైటకు వెళ్లాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్నారు.
అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లవద్దని ప్రజలను నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఎండలో బైటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బాగా నీళ్లను తాగి వెళ్లాలి,
ఒక వాటర్ బాటిల్, గొడుగును, టోపీ లను తప్పనిసరిగా పెట్టుకొవాలి.
ఎండలో చల్లని బట్టను నీళ్లలో నానబెట్టి, తలకు చుట్టుకొవాలి.
వాటర్ మిలన్, కీర దోసకాలను, జ్యూస్ లను ఎక్కువగా తీసుకొవాలి.
సమ్మర్ లో టీలు, స్పైసీ ఫుడ్ లను ఎక్కువగా తినడం అవాయిడ్ చేయాలి.
వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ఎక్కువగా వేసుకొవాలి.