బీట్రూట్ చేసేందుకు ఎర్రగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఆరోగ్యప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. భూమిలో పండే ఈ బీట్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజూ డైట్లో బీట్రూట్ చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉణ్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలను తగ్గిస్తుందని వెల్లడించారు.
బీట్ రూట్లో ఉండే అద్బుతమైన ప్రయోజనాలు రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని నైట్రేట్లు రక్త ప్రసరణను పెంచే లక్షణం ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
బీట్రూట్ లో కేలరీలు తక్కువగా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గాలంటే బీట్రూట్ క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్ లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఆంథోసైనిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటర లక్షణలు ఉన్నాయి.
దెబ్బతగిలిన ప్రాంతాంలో వాపుతోపాటు మంట వస్తుంది. బీట్రూట్ లో ఉండే బీటా లైన్లు, పిగ్మెంట్స్ ఉపయోగిపడతాయి. వీటిలో దెబ్బలను త్వరగా తగ్గించి వాపునకు కంట్రోలో చేసే లక్షణాలు ఉన్నాయి.
బీట్రూట్ కాలేయాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ గట్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బీట్రూట్ ను రోజూ ఆహారంలో చేర్చుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మతిమరపుతో బాధపడేవారికి బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.