పాల ఉత్పత్తుల్లో కనిపించే చక్కెరను లాక్టోస్ అంటారు. పాల పదార్థాలను తింటే అతిసారం, ఉబ్బురం, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఉరుకుల పరుగుల జీవితంలో వండుకునే సమయం లేదు. దీంతో ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఉదా: బ్రెడ్, మ్యాగీ, రెడీమేడ్ చపాతీ తదితర. వీటివలన ప్రమాదకర రసాయనాలు చేరి పేగులపై ప్రభావం చూపుతుంది.
రెడ్ మీట్‌ను ఎరుపు మాంసం అంటారు. ఈ ఎరుపు మాంసంలో ఉండే కొవ్వు పదార్థం పేగు మంటలను పెంచుతుంది. పేగు సమస్యలకు దారి తీస్తుంది. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.
మానవ ఆరోగ్యంపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ వ్యవస్థపై తీరని భారం మోపుతుంది. పేగు సంబంధిత సమస్యలకు మద్యం కారణమవుతుంది.
సుక్రోజ్ వంటి కృత్రిమ చక్కెర పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. జీర్ణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తాయి.
బజ్జీలు, పూరీలు, వడలు వంటివి నూనె పదార్థాలు చాలా ప్రమాదం. ఇవి కడుపు లైనింగ్‌కు ఇబ్బందులకు గురి చేస్తాయి. చెడు కొవ్వులను చేరుస్తాయి.