పసుపు కలిపిన ఇడ్లీలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇది ప్రకృతిసిద్ధమైన యాంటీబయాటిక్‌లాగా పనిచేస్తుంది.
పసుపులో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండి, శరీరంలో నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇడ్లీ పిండిలో ఒక చెంచా పసుపు పొడి కలపండి. పిండిని బాగా కలిపి సాధారణంగా ఇడ్లీలు వండినట్లే వండండి. వీటిని చట్నీ కన్నా కూడా కూరగాయలతో చేసిన సాంబార్తో కలిపి తింటే ఆరోగ్యం మెరుగవుతుంది.
పసుపు కలిపిన ఇడ్లీలు జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
ఈ టిప్‌ను పాటించి రోజూ ఈ ఇడ్లీలు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇడ్లీ పిండిలో పసుపు కలపడం ద్వారా ఇది చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సహాయపడే సహజ ఔషధంగా మారుతుంది.
పసుపు కలిపిన ఇడ్లీలు మీ రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. ఈ ఆహారంతో శక్తిని పొందండి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.