ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రైస్ వాటర్ తెగ ట్రెండ్ అవుతోంది..
ఈ వాటర్ మొహానికి అప్లై చేస్తే మన మొహం కొరియన్ గ్లాస్.. మొహం లాగా మెరిసిపోతుందని ఎంతోమంది వీడియోలు పెడుతున్నారు.
కానీ ఈ వార్తలో నిజం ఉందా లేదా అని ఎంతో మందికి సందేహం కూడా ఉంది.
అసలు విషయానికి వస్తే.. వైద్యుల సైతం ఈ రైస్ వాటర్ మొహానికి అప్లై చేయడం మంచిదే అని చెప్తున్నారు.
ముఖ్యంగా ఆయిలీ స్కిన్, మొటిమలు ఉన్నవాళ్లు రైస్ వాటర్ తో రోజు మొహం కడుక్కుంటే.. మొహంపై ఉన్న మొటిమలు, మరకలు పోయి ఫ్రెష్ గా అనిపించడం ఖాయమంట.
ఈ రైస్ వాటర్ కోసం మనం చేయాల్సిందల్లా.. కొంచెం బియ్యం ఒక గిన్నెలోకి తీసుకొని.. అందులో నీళ్లు పోసి మూడు గంటలసేపు వదిలేయాలి.
ఆ తరువాత నీళ్లను వేరుచేసి.. ఆ నీళ్లను 24 గంటలసేపు ఒక గ్లాస్ జారులో పోసి వదిలేయాలి. ఈ నీళ్లతో రోజుకి రెండుసార్లు కానీ మొహం తుడుచుకుంటే.. ఎంతో అందంగా కనిపించడం ఖాయం.