కన్యాకుమారిలో చూడదగ్గ 10 అద్భుత ప్రదేశాలు ఇవే..

TA Kiran Kumar
May 31,2024
';

వివేకానంద రాక్ మెమోరియల్

వివేకానంద రాక్ మెమోరియల్ కన్యకుమారిలోని ఒక రాతి ద్వీపంలో ఉంది.

';

తిరువల్లువర్ విగ్రహం

వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే తమిళుల ఆరాధ్య కవి తిరువల్లువర్ విగ్రహం ఉంటుంది. 133 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం జ్ఞానానికి, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు.

';

సూర్యోదయం వ్యూ పాయింట్..కన్యాకుమారి బీచ్

కన్యాకుమారి బీచ్ దాని బంగారు ఇసుక దిబ్బలో పర్యాటకులను అలరిస్తోంది. సందర్శకులు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు.

';

పద్మనాభపురం ప్యాలెస్

కన్యాకుమారిలో మరో సందర్శనీయ స్థలం పద్మనాభపురం ప్యాలెస్. కేరళ, తమిళనాడుక నిర్మాణ వైభవాన్ని ప్రదర్శించే 16వ శతాబ్ధానికి చెందిన అద్భుతమైన చెక్క ప్యాలెస్. ఇక్కడి కళాఖండాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

';

శుచింద్రం ఆలయం

హిందూ దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మరియు శివ త్రిమూర్తులకు అంకితం చేయబడిన శుచింద్రం ఆలయం ఇక్కడే కొలువై ఉంది. శుచింద్రం ఆలయం ఎత్తైన గోపురం, శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయ వాస్తు ద్రావిడ మరియు కేరళ శైలుల సామరస్య సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది

';

గాంధీ స్మారక మండపం

మహాత్మా గాంధీ గౌరవార్థం నిర్మించిన గాంధీ స్మారక మండపం. ఈ స్మారకం వద్ద మహాత్మ గాంధీ చితా భస్మాన్ని నిమజ్జనం చేసిన ప్రదేశం కావడంతో ఆయన గౌరవార్ధం అక్కడ ఈ మండపాన్ని నిర్మించారు.

';

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట సముద్రానికి అభిముఖంగా ఉన్న పురాతన కోట. ఈ కోట నుంచి కన్యాకుమారి యొక్క అందమైన దృశ్యాలను చూసి ఎంజాయ్ చేయోచ్చు. ఇక్కడ తమిలనాడుతో పాటు భారతదేశ కళాఖండాలు మరియు చారిత్రక అవశేషాలను ప్రదర్శించే చిన్న మ్యూజియం ఉంది.

';

మాథుర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్

మాథుర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ భారతదేశంలోని పొడవైన మరియు ఎత్తైన వంతెనలలో ఒకటైన మాథుర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదుగా నడవడం ద్వారా మీ సాహసాన్ని ప్రదర్శించవచ్చు. పరాజియార్ నదిపై విస్తరించి ఉన్న ఈ వంతెన చుట్టుపక్కల ప్రకృతి దృశ్య్యాలను పర్య

';

సూర్యాస్తమయం వ్యూ పాయింట్

పర్యాటకులను మంత్రముగ్దులను చేసే సూర్యాస్తమయం అనుభవం కోసం, కన్యాకుమారి బీచ్ సమీపంలో ఉన్న సన్‌సెట్ వ్యూ పాయింట్‌కి వెళ్లడం మరకండి. ఆకాశం మరియు సముద్రం కలిసే సూర్యుడు అస్తమించే ప్రదేశం చూడటానికి రెండు కళ్లు చాలవు.

';

వట్టకోట్టై కోట తీరం

వట్టకోట్టై కోట తీరం వెంబడి ఉన్న వట్టకోట్టై కోట 18వ శతాబ్దం నాటి చారిత్రాత్మక కట్టడం. సముద్రం యొక్క విశాల దృశ్యాలను ఇక్కడ నుంచి చూసి ఆస్వాదించవచ్చు. ఇక్కడ కట్టడం దృఢమైన రాతి ప్రాకారాలు, బురుజులు మరియు ఫిరంగి వంటి కోట అవశేషాలను చూడొచ్చు.

';

VIEW ALL

Read Next Story