మార్కెట్లో టమాటాల రేట్లు మండిపోతున్నాయి. దీనికి బదులు కూరల్లో ఏ వస్తువులు వేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఇవి దాదాపు మన ఇళ్లలో అందుబాటులో ఉంటాయి.
టమాటాలకు బదులుగా పుల్లని పెరుగు వాడవచ్చు.
టమాటాలు రేటు పెరిగితే టమాటా ప్యూరీ వాడొచ్చు.
టమాట మాదిరి చింతపండు కూడా పుల్లగా ఉంటుంది ఇది కూడా కూరలో వేసుకోవచ్చు.
మామిడికాయతో చేసే ఆమ్చూర్ కూడా పుల్లని రుచిని అందిస్తుంది.
వంటల్లో ఆరోగ్యకరమైన గుమ్మడికాయ ప్యూరిని కూడా వేసుకోవచ్చు.
ఎర్రని బెల్ పేప్పర్స్ కూడా కూరలకు టమాటా వంటి రుచిని అందిస్తాయి.
వెనిగర్ కూడా కూరలకు పుల్లని రుచిని అందిస్తాయి వీటిని కూడా టమాటాకు బదులుగా వాడొచ్చు.