ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు రోజు డైట్ లో భాగంగా యాపిల్ సలాడ్ని తీసుకోవడం ఎంతో మంచిది.
';
యాపిల్ సలాడ్ ను ఐదు నెలల పాటు డైట్లు చేర్చుకోవడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్లో నియంత్రించుకోవచ్చు.
';
అంతేకాకుండా ఈ సలాడ్ ను తినడం వల్ల గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది.
';
తరచుగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రోజు యాపిల్ సలాడ్ ను తినడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.
';
అయితే మీరు కూడా ఈ సలాడ్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా.. ఇప్పుడే ఇలా చేసుకోండి.
';
యాపిల్ సలాడ్ కు కావలసిన పదార్థాలు: 2 యాపిల్స్ (మీకు ఇష్టమైన రకం), 1/2 కప్పు ద్రాక్ష, 1/4 కప్పు చిన్న ముక్కలుగా చేసిన అరటి పడ్లు
';
కావలసిన పదార్థాలు: 1/4 కప్పు చిన్న ముక్కలుగా చేసిన కివి, 1/4 కప్పు గింజలు (బాదం, పిస్తా, మొదలైనవి), 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె, 1/2 కప్పు గ్రీకు యోగర్ట్ (కావలసినంత)
';
తయారీ విధానం: పండ్లను తయారు చేసుకోండి: యాపిల్స్ ను చక్కగా కడిగి, గింజలను తీసివేసి, చిన్న ముక్కలుగా చేసుకోండి. ద్రాక్ష, అరటి పళ్ళు, కివిలను కూడా చిన్న ముక్కలుగా చేసుకోండి.
';
మిశ్రమం చేయండి: ఒక పెద్ద బౌల్‌లో అన్ని పండ్ల ముక్కలను కలుపుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
డ్రెస్సింగ్ తయారు చేయండి: ఆ తర్వాత మరో చిన్న బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, తేనె కలిపి బాగా కలపండి.
';
కలపండి: పండ్ల మిశ్రమంపై డ్రెస్సింగ్ పోసి బాగా కలపండి. మీరు ఇష్టపడితే గ్రీకు యోగర్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది..
';
ఇలా తయారు చేసుకున్న సలాడ్ ను రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.