చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలే, కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి!
ప్రస్తుతం చాలామంది ఎక్కువగా రెడ్ మీట్ తింటున్నారు. దీని కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో చాలామందిలో గుండెలోని ధమనులు దెబ్బతింటున్నాయి.
ప్రతిరోజు వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నారు. వీటి వల్ల కూడా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చెక్కర అధికంగా ఉండే ఆహారాలు కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో అమ్మే బంగాళదుంప చిప్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని తినేవారు తప్పకుండా దీనిని దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచిది.
కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను వినియోగించడం వల్ల కూడా గుండె పనితీరులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కొంతమందిలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.
ఎక్కువగా బేకరీ ఫుడ్స్ తినడం వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా వీటిని తినడం మానుకోండి.
అతిగా ఉప్పు కలిగిన ఆహారాలు తినడం వల్ల కూడా సులభంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.