లిప్స్ పై లిప్స్టిక్స్ వాడటం వల్ల.. కెమికల్స్ మనం ఏదైనా తినేటప్పుడు కడుపులో పలికి వెళ్లి.. భవిష్యత్తులో అనారోగ్యాలు తీసుకురావచ్చు.
అలా అని లిప్స్టిక్ వేసుకోకుండా చాలామంది ఉండలేరు. అలాంటి వారి కోసమే ఈ బీట్రూట్ లిప్స్టిక్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
ముందుగా రెండు బీట్రూట్ బాగా తరిగి.. మిక్సీకి వేసి కొద్దిగా నీళ్లు పోసి జ్యూస్ లా చేసుకోండి. ఆ తర్వాత వడకట్టుకొని బీట్రూట్ జ్యూస్ నీళ్లు మాత్రం ఒక గిన్నెలో పోసి పెట్టుకుంది.
స్టవ్ పై పాన్ పెట్టుకుని.. ఒక గెంటి కొబ్బరి నూనె పోసుకోండి.
అది బాగా మరుగుతున్నప్పుడు.. రెండు గెంటిల బీట్రూట్ జ్యూస్ పోసుకోండి.
ఈ మిశ్రమం బాగా దగ్గరపడ్డాక.. స్టవ్ ఆపేసి అందులో ఒక స్పూన్ వాజిలిన్ వేసుకొని బాగా కలుపుకోండి.
ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గ్లాస్ జార్లో పెట్టుకొని రోజు లిప్స్ కి పూసుకుంటే.. లిప్స్ ఎర్రగా ఉండడమే కాదు.. మీ లిప్స్ నల్లగా ఉన్న కానీ ఎర్రగా అవుతాయి.