రాత్రిపూట అన్నం తినడం మంచిదే కానీ, మోతాదు తగినంతగా ఉంచాలి.
బ్రౌన్ రైస్ లేదా వేరే ఫైబర్ రైస్ తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
అన్నంతో పాటు కూరగాయలు…లేదా ఏదన్నా ప్రోటీన్ కర్రీ తీసుకోవడం.. పౌష్టికాహారంగా ఉంటుంది.
రాత్రి తిన్న తర్వాత తేలికపాటి వ్యాయామం చేయడం శరీరానికి మంచిది.
అన్నం తిన్నప్పుడు మసాలాలు తగ్గించి, తక్కువ నూనెతో వండాలి.
రాత్రి పూట తక్కువ మోతాదులో సమతుల్యమైన భోజనం చేయడం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అన్నిటికంగా ముఖ్యంగా ఏడు గంటల లోపే.. రాత్రిపూట డిన్నర్ ముగించడం మంచిది.
అన్నాన్ని మితంగా తీసుకుంటే రాత్రిపూట తిన్నా, బరువు తగ్గడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.