మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందించాలి. అప్పుడే మన శరీరం కణజలాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
మనకు కావాల్సిన ప్రొటీన్ శరీరానికి అందాలంటే కోడిగుడ్లు, చికెన్ ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ రెండింటిలో ఏది తింటే శరీరానికి ప్రొటీన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
100 గ్రాముల చికెన్ తింటే 143 కేలరీలు లభిస్తాయి. 100 గ్రాముల చికెన్ లో 24.11 గ్రాముల ప్రొటీన్, 2.68 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.12 గ్రాముల కొవ్వు ఉంటుంది.
చికెన్ లో కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ భాగం తింటే కండరాలను పెంచుకోవచ్చు.
100 గ్రాముల ఉడికించిన గుడ్డులో 155 కేలరీలు ఉంటాయి. 12.58 గ్రాముల ప్రొటీన్ , 1.12 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 10.61 గ్రాముల కొవ్వు ఉంటుంది. గుడ్లలో పెద్ద మొత్తంలో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది.
గుడ్డును ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు. అందుకే చాలామంది పోషకాహార నిపుణులు ఉడికించిన గుడ్లను తినాలని సలహా ఇస్తుంటారు.
గుడ్డులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియంతోపాటు పలు పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడతాయి.
మీ శరీరానికి ప్రతిరోజూ 40 గ్రాముల ప్రొటీన్ అవసరం ఉంటుంది. రోజూ తగిన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటే అనారోగ్యం తగ్గుతుంది.