డయాబెటిస్‌కి ది బెస్ట్ కర్రీ.. ఇలా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్..
Dharmaraju Dhurishetty
Nov 22,2024
';
ముఖ్యంగా మెంతికూరలో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు డయాబెటిస్ ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
';
అలాగే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మెంతికూరను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
';
మెంతికూరను వివిధ రకాల ఆహార పదార్థాలుగా తయారు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఆకులతో పప్పును తయారు చేసుకుంటారు.
';
మెంతికూర పప్పు కూడా శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
';
కావలసిన పదార్థాలు: మెంతికూర - 1 గుత్తి, పసుపు - 1/2 tsp, కారం - 1 tsp (రుచికి తగినంత), ఉప్పు - రుచికి సరిపడ
';
కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1/2 tsp, ఎండు మిరపకాయలు - 2-3, కరివేపాకు - కొద్దిగా, తగినంత నీరు
';
తయారీ విధానం: ముందుగా మెంతి కట్టలను తీసుకొని వాటి ఆకులను వేరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టుకోండి.
';
ఆ తర్వాత పెసరపప్పును ఒక చిన్న కప్పులో తగినంత వేసుకొని అందులో నీటిని పోసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టుకొని తగినంత నూనె వేసుకుని అన్ని రకాల పోపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వాలి.. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు వేసి మిక్సీ కొట్టుకోండి.
';
చిటపటలాడిన పోపు దినుసుల్లోనే మిక్సీ పట్టిన అన్ని రకాల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోండి.
';
అన్ని బాగా వేగిన తర్వాత అందులోనే మెంతికూర పప్పు వేసి.. పప్పు మెత్తబడేంతవరకు బాగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మసాలా, తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి