ప్రపంచంలో అనేక రకాల పుష్పాలు ఉన్నాయి.
కొన్ని పువ్వులు అద్భుతమైన సువాసన ఇస్తాయి. మరికొన్ని అలంకరణను ఇస్తాయి.
పూజలు మొదలుకొని ఫంక్షన్లలో అలంకారాల వరకు అనేక రకాల పూలను ఉపయోగిస్తారు.
అయితే ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు పేరేంటో మీకు తెలుసా
ప్రపంచంలోని అతిపెద్దగా వికసించే పుష్పం పేరు రాఫ్లేసియా ఆర్నాల్డి
ఈ అరుదైన పుష్పం ఇండోనేషియాలోని రెయిన్ ఫారెస్టులో కనిపిస్తుంది.
ఇది 3 అడుగుల వరకు పెరుగుతుంది. 7 కిలోల బరువు ఉంటుంది.
ఇదొక పరాన్నజీవి మొక్క. ఇందులో కనిపించే ఆకులు, వేర్లు లేదా కాండం ఉండదు.