ఈ చిన్న లడ్డు తింటే.. మీ మెమొరీ పవర్‌ పదింతలు అవ్వడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jan 18,2025
';

చాలామంది వాల్నట్స్ లడ్డును రోజు తింటూ ఉంటారు. నిజానికి వీటిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

వాల్నట్స్ లో ఉండే కొన్ని మూలకాలు మెమొరీ పవర్ను పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయట.

';

వాల్ నట్స్ తో చేసిన లడ్డు తినడం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

';

ఎప్పటినుంచో ఇంట్లోనే వాల్నట్స్ లడ్డూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

వాల్ నట్స్ లడ్డుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం పూర్తి వివరాలు ఇవే..

';

కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ (అక్రోట్లు) - 1 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము - 1/2 కప్పు (లేదా రుచికి సరిపోయేంత)

';

కావలసిన పదార్థాలు: యాలకుల పొడి - 1/4 టీస్పూన్, ఎండు కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు (కావలసినంత), కిస్మిస్, బాదం పలుకులు - గార్నిష్ కోసం (కావలసినంత)

';

తయారీ విధానం: వాల్నట్స్ లడ్డుని తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ వేడి చేసి అందులో వాటిని వేసుకొని తగినంత నెయ్యి వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేపుకోండి.

';

వాల్నట్స్ బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వాటిని వేసుకొని అందులోనే బెల్లం తురుము, కిస్మిస్, బాదం పలుకులు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్తంత నెయ్యి వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకొని.. వేరే బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ముద్దలు కట్టుకొని రోజు ఉదయాన్నే తింటే మెమొరీ పవర్ బూస్ట్ అవుతుంది..

';

VIEW ALL

Read Next Story