వేసవికాలం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. వారికి స్వీట్ కార్న్ దోశ చేసి పెట్టండి.. ఎంతో ఇష్టంగా తింటారు
ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒక కప్పు స్వీట్ కార్న్, అరే స్కూల్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
ఈ పిండిని పెనుము మీద దోశలాగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ దోశ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీతో, టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది.