Energetic food: ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గిన్నె ఇది తినండి చాలు..ఎంతో యాక్టివ్‎గా ఉంటారు

Bhoomi
Nov 26,2024
';

బలహీనత

మనలో చాలా మంది బలహీనంగా ఉంటారు. తరచుగా నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు.

';

శరీరానికి పోషకాలు

ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. ఈ కారణంగా నీరసం, అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.

';

రుచికరమైన వంట

అయితే మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఓ చక్కటి రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని తింటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.

';

ఎనర్జిట్ ఫుడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాదంపప్పు, నానబెట్టిన సబ్జాగింజలు, ఓట్స్, ఆపిల్, అరటిపండు, వేడి చేసిన పాలు, నీళ్లు, బెల్లం

';

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలోకి పాలు, నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత అందులో బాదం, ఓట్స్ వేసి కలపాలి. ఉడిచిన తర్వాత సబ్జా గింజలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

';

ఎనర్జిటిక్ ఫుడ్ రెడీ

తర్వాత అందులో బెల్లం, అరటి ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచికరమైన ఎనర్జిటిక్ ఫుడ్ రెడీ అవుతుంది.

';

షుగర్ వ్యాధి

షుగర్ వ్యాధి గ్రస్తులు ఇందులో బెల్లం వేసుకోకపోవడం మంచిది. ఇతర పండ్ల ముక్కలను, డ్రైఫ్రూట్స్ ను వేసుకోవచ్చు.

';

బరువు తగ్గాలనుకునేవారు

బరువు తగ్గాలనుకునేవారు, బీపీతో బాధపడేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా ఎవరైనా దీన్ని తినవచ్చు.

';

రోజంతా ఉత్సాహం

నీరసం, బలహీనత, నిస్సత్తువ, రోజంతా ఉత్సాహంగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఎనర్జిటిక్ ఫును తయారు చేసుకుని తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story