చలికాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ కాలంలో జుట్టు వేగంగా పెరగాలంటే తినాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జట్టు వేగంగా బలంగా పెరగాలంటే బాదం, అక్రోట్లు, అవిసె గింజలు, చియా గింజలను డైట్లో చేర్చుకోవాలి.
ప్రొటీన్లు, బయోటిన్స్ అధికంగా ఉండే గుడ్లు కెరాటిన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఇది జుట్టు నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అధికంగా ఉండే కొవ్వు చేపను డైట్లో చేర్చుకోవాలి. స్కాల్ప్ ను హైడ్రేట్ చేస్తుంది. జుట్టు చిట్లిపోకుండి కాపాడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.
ఐరన్, ఫొలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఆకుకూరలు స్కాల్ప్ కి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు , జట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
బీటాకెరోటిన్ ఉండే చిలకడదుంపలు డైట్లో చేర్చుకుంటే జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన అవకాడోలు స్కాల్ప్ ఆరోగ్యానికి, దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది.
బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉన్న క్యారెట్ జుట్టు మూలాలను బలంగా మారుస్తుంది. జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. మెరిసే జుట్టును ప్రోత్సహిస్తుంది.
ప్రొటీన్, ప్రొబయోటిక్స్ గ్రీకు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. గ్రీకు పెరుగు జుట్టును బలంగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.